తెలుగుదేశం, వైసీపీ దొందూదొందే.. రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. విజయసాయిరెడ్డి.!

Publish Date:Sep 7, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది.  రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు  కీలక నేతగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నూతన రాజకీయ పార్టీ ప్రకటన అధికారికంగా చేశారు.  రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ సరళికి పూర్తి భిన్నంగా, పూర్తిగా ప్రజా పక్షం వహించే సరికొత్త ప్రత్యామ్నాయ వేదికను తీసుకురావడమే లక్ష్యంగా తన కొత్త పార్టీ ఉంటుందన్నారాయన.

సోమవారం (సెప్టెంబర్ 7) విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన విజయసాయి  ప్రస్తుత రాజకీయ పార్టీలవి కేవలం ఎన్నికల రాజకీయాలే తప్ప, వాటిలో సామాన్యుల నిజమైన సమస్యలను పట్టించుకునే తత్వం కరువైందని  విమర్శించారు. అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ధోరణులు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమన్నారు. సమాజంలోని నిరుపేదలు, సామాన్యులు, కర్షకులు,  యువత ఎదుర్కొంటున్న సమస్యలకు అసెంబ్లీ,  పార్లమెంటు వేదికగా గొంతుక వినిపించేందుకు ఒక బలమైన శక్తి అవసరమని, అందుకే తాను తన  నూతన రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చిందని విజయసాయి వివరించారు.  

ఈ కొత్త రాజకీయ వేదిక విశేషాలు, పార్టీకి సంబంధించిన పూర్తి విధివిధానాల  ప్రకటన త్వరలోనే దశలవారీగా వెల్లడిస్తామన్న విజయసాయి..  కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో కూడిన పరిపాలనా విధానాన్ని అందించేందుకు తన రాజకీయ పార్టీ పనిచేస్తుందని   స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను సేకరించి, ప్రజా సమస్యలపై సమగ్రమైన కార్యాచరణను రూపొందించనున్నట్లు విజయసాయి చెప్పారు. తన కొత్త పార్టీ సీఎం అభ్యర్థిని తాను కాదని ఈ సందర్భంగా చెప్పిన విజయసాయి..  సంకేతాలు ఇచ్చారు. గతంలో తాను తీసుకున్న రాజకీయ విరామ నిర్ణయాన్ని పక్కన పెట్టి, ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి పునరాగమనం చేస్తున్నట్లు చెప్పారు. 

 
[Vijayasai Reddy Announce new party, AP politics, YCP, TDP, Andhra Pradesh politics,  Vijayasai Reddy announcement, Teluguone]

By
en-us Political News

  
ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే, కొండా సురేఖ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే ఆమెకు బీజేపీనుంచి ఆహ్వానం అందిందని కూడా చెబుతున్నారు. కొండా సురేఖ బీజేపీ గూటికి వస్తే తమకు  అభ్యంతరం లేదని ఆ పార్టీ రాష్ట్ర నాయకుల నుంచి ఆమెకు స్పష్టమైన సంకేతాలు అందాయని చెబుతున్నారు.  
జగన్  ఢిల్లీ పర్యటన కేంద్రం పెద్దల ఆశీస్సులతో.. కేసుల నుంచి రక్షణ పొందేందుకేనన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమైంది. అయితే జగన్ హస్తిన పర్యటన వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి వారాలు గడిచిపోయినా ఆయన బెంగళూరు, తాడేపల్లి ప్యాలెస్ మధ్య తిరగడం తప్ప హస్తిన  ఫ్లైట్ ఎక్కలేదు.
కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్  ఎవరి స్వార్థం కోసం చేసిన రచ్చ కాదు, పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు తీసుకున్న చర్య అని  వివరించారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వంని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన వీరేషం..  క్రమశిక్షణ రాహిత్యంగా ఎవరు మాట్లాడినా సరే సహించేది లేదు అని వీరేషం స్పష్టం చేశారు.
ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తే రాదనీ, జనం అందుకు అవసరమైనంత మంది సభ్యులను గెలిపించి సభకు పంపాల్పి ఉంటుందనీ మధుసూదన్ రెడ్డి చెప్పారు.  
ఇటీవలి కాలంలో హిమాన్షు రావు  తన  ఫిట్‌నెస్‌తో, సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు.
బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించి, హిందుత్వ వ్యవహారంలో బీజేపీని మించి మరీ గుర్తింపు పొందిన రాజాసింగ్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందుత్వ అజెండాను ఎత్తుకున్న పవన్ దృష్టి రాజాసింగ్ పై పడిందని అంటున్నారు.
వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా జరుగుతాయనీ, మావిగన్ కు మద్దతు ఇచ్చే వారు వైసీపీకి, అమరావతి కావాలనుకునే వారు తెలుగుదేశం కూటమికి ఓటు వేస్తారనీ, ఎవరు గెలుస్తారో చూద్దామనీ సవాళ్లు విసురుతుంటే.. ఆర్కే రోజా మాత్రం మావిగన్, అమరావతీ ఒక్కటేననీ, ఏమీ తేడాలేదనీ చెబుతూ జగన్ గాలి తీసేశారు.
ఇందుకు ఆయన మాటలు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల ఒక వేడుకలో పాల్గొన్న చామకూర మల్లారెడ్డి.. తాను బీఆర్‌ఎస్ పార్టీకి క్రమంగా దూరమవున్నానని బాహాటంగానే అఅంగీకరించారు. తాను పార్టీకి కాస్త దూరం కాగానే, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, సొంత మద్దతుదారులు తనను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారన్న ఆవేదనను ఆ సందర్భంగా వ్యక్త పరిచారు.
రాష్ట్ర రాజకీయాలలో హోంమంత్రిగా పవన్ కల్యాణ్ అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రానున్న రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారన్న సమాచారం నేపథ్యంలో హోంమంత్రి మార్పు తథ్యమన్న చర్చ రాజకీయవర్గాలలో మొదలైంది.
తాజాగా వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నిర్వహించిన ఒక భారీ ర్యాలీలో బీఆర్ఎస్ గులాబీ జెండాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిచ్చాయి. కేటీఆర్ పర్యటన వేదిక వద్ద కేటీఆర్, వైఎస్ జగన్ ఇద్దరి చిత్రాలు పక్కపక్కనే ఉన్న కటౌట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
అనుదీప్ కటికల, రఫీక్ వంటి వ్యక్తులు కామెడీ ముసుగులో చేస్తున్న వ్యాఖ్యలు కేవలం హాస్యం కోసం మాత్రమే కాకుండా, ఒక పథకం ప్రకారం జరుగుతున్న రాజకీయ కుట్రగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగు వన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు, అనుదీప్, రఫీక్ వంటి వారు స్టాండప్ కామెడీ ముసుగులో చేస్తున్న వికృత వ్యాఖ్యల వెనుక ప్రత్యర్థి రాజకీయ పార్టీల ప్రోత్సాహం ఉందన్నారు.
కాంగ్రెస్ లో సిఎం అభ్యర్థి విషయంలో పార్టీ ఫ్లోర్ లీడర్ సతీషన్, సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల మధ్య పోటీ ఉన్నప్పటికీ.. అధిష్ఠానం మొగ్గు సతీషన్ వైపే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మెజార్టీ ఎమ్మెల్యేలు, అధిష్టానం ఆశీస్సులతో పాటు సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్, శశి థరూర్ లాంటి వారి మద్దతు ఎవరికి దక్కుతుందో తెలియాల్సి ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.